అందుకు మేము సిద్దమే : పాక్ ప్రధాని

Update: 2018-12-08 07:24 GMT

భారత్ లోని బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికీ ముస్లిం, పాకిస్తాన్‌ కు వ్యతిరేకమని అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, శాంతి చర్చలకు ఆహ్వానించినా స్పందించడం లేదని అమెరికాకు చెందిన ఓ వార్త చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే సార్క్‌ సమావేశం నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. కాగా సార్క్‌ చార్టర్‌ సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటుందని 34వ సార్క్‌ చార్టర్‌డే వేడుకలో పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి తెహ్రిమా జాన్జువా తెలిపారు.