నర్తనశాల అనే సినిమా

Update: 2018-11-01 11:44 GMT

ఓల్డ్ ఈజ్ గోల్డ్...అంటారు... అలాంటి సినిమానే... నర్తనశాల....నర్తనశాల అనే సినిమా... మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములో విడుదలైన తెలుగు సినిమా.  పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ సినిమా మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమా రాష్ట్రపతి బహుమానాన్ని, నంది అవార్డును గెలుచుకొంది. 1964లో ఇండొనీషియా రాజధాని, జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు (ఎస్. వి. రంగారావు), ఉత్తమ కళాదర్శకుడు బహుమతులు గెలుచుకొంది. మీరు...కొత్త నర్తనశాల సినిమా చూసినా కూడ ఇది చూడవచ్చు. శ్రీ.కో.

Similar News