ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంట విషాదం నెలకొంది అయన తండ్రి రాఘవరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం రాఘవరెడ్డి భౌతిక కాయాన్ని వీరి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురానికి తరలిస్తున్నారు. గ్రామంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పొంగులేటి రాఘవరెడ్డి పార్ధివదేహాన్ని పలువురు నేతలు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు.. కాగా ఫోనులో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డిని పరామర్శించినట్టు తెలుస్తుంది..