నారి నారి నడుమ మురారి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1990 లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఆర్థికంగా విజయవంతం అయిన చిత్రము. ఇందులో బాలకృష్ణ, శోభన, నిరోషా ప్రధాన పాత్రలు పోషించారు. నారీనారీ నడుమ మురారి చిత్రానికి వెంకటేశ్వర మహాత్యం సినిమా కొంత ఆధారంగా కనిపిస్తుంది. యువచిత్ర పతాకం పై నిర్మాత మురారి బాలకృష్ణ హీరో గా నిర్మించిన రెండవ చిత్రం. తొలి చిత్రం సీతారామ కళ్యాణం. చిత్రంలో కథానాయకుని పేరు కూడా వెంకటేశ్వర రావే కావటం గమనార్హం. చిత్రంలో ఒకపాట, ఒక సన్నివేశం లో పాత చిత్రం తాలూకూ క్లిప్పింగ్స్ కనిపిస్తాయి. కె.వి. మహదేవన్ సంగీతంలో పాటలన్నీ హయిగొలిపేవే. ముఖ్యంగా ఏంగాలో తరుముతున్నదీ, వయసూ సొగసూ కలిసిన వేళ, ఇరువురి భామలా కౌగిలిలో మొదలైన పాటలు అన్ని అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి, మీరు ఇప్పటి వరకు ఈ సినిమా చూడకుంటే ఒకసారి చూడవచ్చు. శ్రీ.కో.