హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గ్రామబాట పట్టారు. మొన్న పల్లె నిద్ర చేసిన ఆయన.., ఇవాళ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పాతచమలపల్లి, దేమకేతేపల్లి, టేకులోడు గ్రామాల్లో పర్యటించి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆడేపల్లి గ్రామంలో గిరిజన మహిళలతో బాలకృష్ణ సరదాగా నృత్యం చేశారు.