ఈశాన్య భారత్‌లో..కాంగ్రెస్ పాలిత రాష్ట్రం మిజోరంలో పాగా వేయటానికి బీజెపీ కసరత్తులు చేస్తోంది. కాంగ్రెస్ విముక్త ఈశాన్య భారతం అన్న నినాదంతో...వచ్చే నెలలో జరిగే నాలుగురాష్ట్రాల ఎన్నికల సెమీస్ వార్‌కు ఉరకలేస్తోంది. మరోవైపు...గత రెండు ఎన్నికల్లోనూ తిరుగులేని... కాంగ్రెస్..వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకొని...హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.
మిజోరం...ఈశాన్య భారత్ లో...722 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఏకైక రాష్ట్రం. మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న అతిబుల్లి రాష్ట్రం మిజోరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అత్యధిక గిరిజన జనాభా కలిగిన మిజోల గడ్డపైనా...శాసనసభ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ పాలిత మిజోరంలో...గత ఎనిమిదేళ్లుగా హస్తంపార్టీ హవానే కొనసాగుతోంది. మరో వైపు...మిజోరంలో పాగా వేయటానికి బీజెపీ తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది.
కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ ల మధ్యే పోటీ ...ప్రధానంగా ఉండే మిజోరంలో....అడుగుపెట్టటానికి... నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం వ్యూహాలకు తెరతీసింది. కాంగ్రెస్ విముక్త ఈశాన్య భారత్ అంటూ ఓ నినాదాన్ని తెరముందుకు తీసుకు వచ్చింది. దేశంలోని అత్యధిక రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బీజెపీ...ఇప్పుడు ...మిజోరం రాష్ట్రం వైపు దృష్టి సారించింది. కాంగ్రెస్ విముక్త ఈశాన్యం భారత్ అంటూ ఓ నినాదం అందుకొంది. నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం...రాజకీయ వ్యూహాలను సిద్ధం చేశారు. అందులో భాగంగానే...కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బుద్ధధన్ చక్మాకు...కమలం తీర్థం ఇచ్చి..
కాంగ్రెస్ శిబిరంలో కలకలం రేపారు.
గత ఎన్నికల్లో...0.5 శాతం మాత్రమే సాధించిన బీజెపీ...చక్మా తెగల జనాభా అధికంగా ఉండే...రెండు శాసన సభస్థానాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ రెండింటిలో కనీసం ఒక్కసీటైనా గెలుచుకోడం ద్వారా ...మిజో శాసనసభలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉంది. కేవలం 11 లక్షల 20 వేల జనాభా మాత్రమే ఉన్న మిజోరంలో...అత్యధిక శాతం గిరిజనులే. అయితే...అక్షరాస్యత శాతం 91.33 గా ఉంది. అంతేకాదు...మిజోరంలో ...కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ ప్రధాన
పార్టీలుగా ఉన్నాయి. పోటీ ప్రధానంగా ఈ రెండుపక్షాల మధ్యనే ఉన్నా...బీజెపీ సైతం తన ఉనికిని చాటుకోడానికి తహతహలాడుతోంది.
త్రిపుర ఫార్ములాతో ...మిజోరంలో పాగావేయాలన్న అమిత్ షా వ్యూహం ఫలిస్తుందా? లేక...మిజోనేషనల్ ఫ్రంట్ మరోసారి అధికారంలోకి వస్తుందా?.....అధికార కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి... పగ్గాలు చేపట్టి తనకు ఎదురేలేదని నిరూపించుకొంటుందా?....తెలుసుకోవాలంటే...డిసెంబర్ 11న ప్రకటించే ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడక తప్పదు.