జగన్ పాదయాత్ర మార్నింగ్, ఈవెనింగ్ వాక్ లా ఉంది : మంత్రి కాల్వ శ్రీనివాసులు

Update: 2017-12-12 08:43 GMT

మరోసారి వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేతపై మంత్రి కాల్వ శ్రీనివాసులు రెచ్చిపోయారు.. జగన్ ఆది నుంచి అభివృద్ధిని అడ్డకుంటూ పాదయాత్ర ద్వారా అసత్యాలు వల్లెవేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. పాదయాత్ర ఓ పవిత్రమైనదని.. ఎందరో చేశారని.. జగన్ చేస్తుంటే మాత్రం మార్నింగ్, ఈవెనింగ్ వాక్ లాగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై పలు విధాలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షనేత అసెంబ్లీకి హాజరుకాకపోవడం వెనుక ఆంతర్యమేంటని, ఎన్నో ప్రజాసమశ్యలు పరిష్కారం కోసం అసెంబ్లీ అనే వేదిక ఉంది ఆలా కాదని జగన్ వీధుల వెంట రోడ్ల వెంట తిరగడంతో అర్ధం లేదని అయన విమర్శించారు..  

Similar News