మీటుతున్న మీటూ.... ఎక్కడి నుంచి ఎక్కడి దాకా!!

Update: 2018-10-12 10:14 GMT

హాలీవుడ్‌ నుంచి భారత్‌కు వచ్చిన మీటూ ఉద్యమం ఉప్పెనలా ఎగసిపడుతోంది. సినీ రంగం నుంచి పలు రంగాలకు విస్తరిస్తోంది. ప్రముఖుల వికృత చేష‌్టలను బయటపెడుతోంది. ఒకరి నుంచి ఒకరు స్పూర్తి పొందుతూ గతంలో తమకు జరిగిన అన్యాయాలను వెల్లడిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినవారికి కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్నారు. మాజీ నటి తనుశ్రీ దత్తా అందించిన స్పూర్తితో భారతదేశంలో మీ టూ ఉద్యమం ఊపందుకుంది. పలు రంగాల్లో పనిచేస్తున్న మహిళలు తమకు గతంలో జరిగిన అన్యాయాలను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తున్నారు. పని ప్రదేశంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులు, దాడులను వెల్లడిస్తున్నారు. 

మీటూ సెగ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ కు తగిలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు స్వాతి మలీవల్ ఈ విషయమై ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడీ వెంటనే ఎంజే అక్బర్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంజె అక్బర్ విషయంలో శివసేన కూడా బిజెపిని టార్గెట్ చేసింది. అక్బర్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని శివసేన నాయకురాలు మనీషా కయాండే డిమాండ్ చేశారు.

పనిప్రదేశంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులు, దాడులను కొందరు మహిళలు మాత్రమే ధైర్యంగా బహిర్గతం చేస్తున్నారని....భారతదేశంలో చాలా రంగాల్లో బాధిత మహిళలు ఇంకా బయటకు రావాలని స్వాతి మలీవల్ పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఆ విషయాన్ని, అందుకు కారణమైన వారి గురించి ట్విట్టర్ వేదికగా వెల్లడించాలని పలువురు ప్రముఖులు ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. మన దేశంలో ఈ ప్రకంపనలు కొన్నినెలల పాటు కొనసాగుతాయనడంలో ఎటువంటి సందేశం లేదు.


 

Similar News