ఒక సినిమా పాటలు బాగా హిట్ అయితే, ఆ పాటల పేర్లతోనే సినిమాలు రావటం అప్పుడప్పుడు జరుగుతుంది. అయితే ఒకే సినిమాలోని దాదాపు అన్ని పాటల తో ఎన్నో సినిమాలు వచ్చిన ఏకైక సినిమా....మాయాబజార్. ఈ రోజుల్లో ...లేదా ఆ రోజుల్లో అయిన... మాయాబజార్ అంటే అది ఒక మాస్టర్ పీసు అని అంటారు... అందరు. అయితే...అహ! నా పెళ్ళంట! (1987) సినిమా, ఒహో నా పెళ్ళంట, చూపులు కలసిన శుభవేళ, వివాహ భోజనంబు, లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాల పేర్లు అన్నీ మాయాబజార్ చిత్రంలోని పాటల ఆధారంగా వచ్చినవి. శ్రీ.కో.