జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండు రోజులుగా ఉత్తరాంధ్ర పర్యటనలో బిజీబిజీగా గడిపారు. నిన్న పర్యటనలో భాగంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పలువిషయాలపై మాట్లాడుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వాన్ని మొదలుకుని రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీపై సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రస్తుతం పవన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
అయితే గురువారం నాడు పవన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ కి అడ్డుపడడంతో బాబి అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాబి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది..