ధూమ్ ధామ్‌గా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎన్నికజోరు.. హోరాహోరి పోటీలో నెగ్గేది ఎవరో..?
కరువు, వలసలు అంటే గుర్తుకొచ్చే జిల్లా ఉమ్మడి పాలమూరు. రాజకీయ ప్రముఖులు ఉన్న ఈ జిల్లాలో తమ తమ పార్టీలను గెలిపించేందుకు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎన్టీఆర్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన కల్వకుర్తి నుంచి ఎన్నో కీలక నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలు ఈసారి బరిలో నిలిచారు. అందుకే అన్ని పార్టీల దృష్టి ఉమ్మడి పాలమూరు జిల్లాపైనే ఉంది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలేంటి? అనుకూలతలేంటి? ప్రతికూల పరిస్థితిలేంటి?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాలు, వనపర్తి జిల్లాలుగా మారింది పాలమూరు. మహబూబ్‌నగర్ జిల్లాలో 5, నాగర్‌కర్నూలు జిల్లాలో 4, జోగులాంబ గద్వాల జిల్లాలో 2, వనపర్తి జిల్లాలో 1 అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న షాద్‌నగర్ విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల పరిధిలోకి మారింది.
ఈసారి రాష్ట్ర రాజకీయాలన్నీ ఉమ్మడి పాలమూరు జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలవాలన్నది గులాబీ పార్టీ ఆలోచన. పాలమూరులో మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూటమితో కలసి మెజారిటీ స్థానాలు గెలుపొంది టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టింది. ఇక మొత్తం 14 నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో చూద్దాం. మహబూబ్‌నగర్. ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరుపున ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాసగౌడ్, కాంగ్రెస్ నుంచి ఎర్ర శేఖర్, బీజేపీ పద్మజారెడ్డి బరిలో నిలిచారు.
జడ్చర్ల. ఈ నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి మదుసూదన్‌యాదవ్ బరిలో నిలిచారు. ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న పోరులో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌లు హోరాహోరీగా తలపడనున్నాయి.
ఇక దేవరకద్ర. ఇక్కడ కూడా త్రిముఖపోరే ఉంది. టీఆర్ఎస్ నుంచి ఆల వేంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి పవన్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి ఇగ్గాని నరసింహులు తలపడుతున్నారు. ఇక్కడ కూడా గులాబీ, హస్తం పార్టీల మధ్యే హోరాహోరీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నారాయణపేట నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోరే. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరపున రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి వామనగిరి కృష్ణ, బీజేపీ నుంచి రతంగ్ పాండురెడ్డి బరిలో నిలిచారు.
వాయిస్6: ఇక మక్తల్. చిట్టెం ఫ్యామిలీకి కంచుకోటలా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీల కంటే కూడా వ్యక్తిగత ప్రతిష్ఠకే పట్టం కడతారు ఇక్కడి ఓటర్లు. టీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్‌మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి దయాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండయ్య తలపడుతున్నారు.
నాగర్‌కర్నూలు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా రికార్డు విజయాలను నమోదు చేసిన నాగం జనార్దన్‌రెడ్డి మంత్రిగా సేవలందించారు. నాగం అంటే నాగర్‌కర్నూలు. నాగర్‌కర్నూలు అంటే నాగం.. ఇలా ఉన్న ఈ నియోజకవర్గంలో తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి, బీజేపీ నుంచి దిలీప్ ఆచారి బరిలో నిలిచారు.
కొల్లాపూర్. జూపల్లి ఫ్యామిలికి ఇది కంచుకోటలాంటి నియోజకవర్గం. ఈసారి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరుపున జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి హర్షవర్దన్‌రెడ్డి, బీజేపీ నుంచి సుధాకర్‌రావు బరిలో నిలబడ్డారు.
అచ్చంపేట నియోజకవర్గంలో ఈసారి టీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ, బీజేపీ నుంచి మల్లేష్ తలపడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరి పోరు ఉండే అవకాశాలున్నాయి.
కల్వకుర్తి. ఈ నియోజకవర్గంలో కూడా త్రిముఖపోరే. ఈసారి టీఆర్ఎస్ నుంచి జైపాల్‌యాదవ్, కాంగ్రెస్ నుంచి వంశీచంద్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆచారి పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగిన పోరు.. ఈసారి త్రిముఖ పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వనపర్తి. ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కంచుకోట. అయితే కాంగ్రెస్, లేకుంటే టీడీపీ అన్నట్టు అభ్యర్థులు గెలిచేవారు. చిన్నారెడ్డి, రావుల ఫ్యామిలీకి పట్టున్న ఈ ప్రాంతంలో ఈసారి త్రిముఖపోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి అమరేందర్‌రెడ్డి బరిలో నిలిచారు.
గద్వాల్. డీకే కుటుంబానికి పెట్టని కోటల ఉన్న నియోజకవర్గంలో ఆ ఫ్యామిలీదే హవా. డీకే కుటుంబ రాజకీయ వారసురాలిగా వచ్చిన డీకే అరుణ తర్వాత గద్వాలను క్రీగంట శాసించారు. అంతకుముందున్న పట్టుతో గద్వాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన డీకే అరుణ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించారు. ఈసారి కాంగ్రెస్ అత్త అరుణ, టీఆర్ఎస్ నుంచి అల్లుడు కృష్ణమోహన్‌రెడ్డి బరిలో దిగి.. అత్తా అల్లుళ్ల సవాల్‌గా మార్చగా బీజేపీ నుంచి వెంకటాద్రిరెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఆలంపూర్. ఈ నియోజకవర్గంలో ఈసారి టీఆర్ఎస్ నుంచి అబ్రహం, కాంగ్రెస్ నుంచి సంపత్‌కుమార్, బీజేపీ నుంచి రజనీమాధవరెడ్డి బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఆసక్తికరమైన పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి కూడా టీఆర్ఎస్ తరపున అంజయ్యయాదవ్, కాంగ్రెస్ నుంచి ప్రతాపరెడ్డి, బీజేపీ నుంచి నెల్లి శ్రీవర్దన్‌రెడ్డి బరిలో నిలిచారు.
ఇక చివరగా కొడంగల్. ఈ నియోజకవర్గంపైనే అందరి కన్ను. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ నియోజకవర్గంపై రేవంత్‌రెడ్డి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి నాగురావు నమోజీ బరిలో నిలిచారు. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది.