గులాబీ దళాధిపతి మొదటి అస్త్రంగా తెలంగాణ సెంటిమెంట్‌ను సంధించబోతున్నారు. 2014 ఎన్నికల తరహాలోనే తెలంగాణ అనుకూల, వ్యతిరేక విభజనవాదాన్ని, ఇప్పటికే గట్టిగా వినిపిస్తున్నారు. మహాకూటమి ఏర్పడుతుందన్న వార్తలొస్తున్న టైంలోనే, దీనికి ప్రాతిపదిక సిద్దం చేసుకుని, గ్రౌండ్‌లెవల్‌లోనే కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజాకూటమిని తెలంగాణ వ్యతిరేక కూటమిగా, జనంలోకి బలంగా తీసుకెళ్లబోతున్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడానికి తెలుగుదేశం భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టాలని డిసైడయ్యారు. ఆంధ్రా పార్టీ అయిన టీడీపీతో ఎలా పొత్తుపెట్టుకుంటారని, కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కేంద్రానికి చంద్రబాబు ఎన్నో లేఖలు రాశారని, మరి అలాంటి చంద్రబాబుతో భుజంభుజం ఎలా కలుపుతారని, హస్తం పార్టీపై విల్లు ఎక్కుపెట్టబోతున్నారు కేసీఆర్. ఇదే విషయాన్ని బహిరంగ సభల్లో, జనం ముందు పెట్టబోతున్నారు.
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తమతోనే ఉండటంతో, కూటమిపై తెలంగాణ వ్యతిరేక ముద్రపడదని గట్టిగా భావిస్తోంది కాంగ్రెస్. అందుకే చంద్రబాబు తర్వాత కేసీఆర్ టార్గెట్ కోదండరాం. ఉద్యమం టైంలో తెలంగాణ ద్రోహుల పార్టీగా, టీడీపీని విమర్శించిన కోదండరాం, ఇప్పుడు అదే పార్టీతో ఎలా జట్టుకడతారని, పదునైన వాగ్భాణాలు సంధించాలనుకుంటున్నారు గులాబీ బాస్. కోదండరాంపై బుల్లెట్ దించడానికి, చంద్రబాబు భుజాలపై తుపాకీ ఉంచి ఫైరింగ్ చేయాలనుకుంటున్నారు కేసీఆర్. కేవలం ఏడెనిమిది సీట్ల కోసం కాంగ్రెస్,టీడీపీలతో కలుస్తున్నారని విమర్శించే అవకాశముంది. అయితే, 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు, తెలంగాణ ద్రోహులను టీఆర్ఎస్‌లోకి చేర్చుకోవడం వంటి అస్త్రాలను తిరిగి కేసీఆర్‌పైనే ప్రయోగించాలని కోదండారం కూడా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.
కేసీఆర్ అనర్గళ ప్రసంగాలు, దెప్పిపొడవులు, చెణుకులు, తిట్లు, శాపనార్థాలు...ఇవి కేవలం మాటలు కాదు, కేసీఆర్ అమ్ముల పొదిలో సమ్మోహనాస్త్రాలు. మరోసారి ఎన్నికల ప్రచారంలో కేవలం తన నోరు ఆయుధంగా ప్రయోగించబోతున్నారు కేసీఆర్. అరవీర భయంకంగా విపక్షాలను తిట్టినతిట్టు తిట్టకుండా, గుక్కతిప్పుకోలేనంతగా విరుచుకుపడాలని డిసైడయ్యారు. తాను చేస్తున్న విమర్శలకు, విపక్షాలు కేవలం ఆన్సరిచ్చుకునేలా, ఆత్మరక్షణలోకి నెట్టేయడం గులాబీ బాస్ వ్యూహం.
రానున్న సభల్లో ఇవే స్కీములను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. వీటికి తోడు వివిధ సామాజికవర్గాలతో వరుస సమావేశాలు, వారికి భవన్‌లు, ప్రత్యేక నిధులు, స్కీమ్‌లను అనౌన్స్ చేస్తూ, సోషల్ ఇంజినీరింగ్‌ను కూడా సమర్థంగా ఇంప్లిమెంట్ చెయ్యాలనుకుంటున్నారు కేసీఆర్. ఇలా ఆరు అస్త్రాలకు పదునుపెడుతున్నారు కేసీఆర్. 19 నుంచి ప్రచారక్షేత్రంలో వీటినే కూటమిపై విసరాలని అనుకుంటున్నారు. విపక్షాలను గుక్కతిప్పుకోకుండా చేయాలని గట్టిగా భావిస్తున్నారు. మరి కేసీఆర్ ఆరు అస్త్రాలు జనంలోకి బలంగా వెళతాయా....కూటమిని కుళ్లబొడుస్తాయా...లేదంటే విపక్షాలే వీటిని సమర్థంగా తిప్పికొడతాయా....అన్నది రానున్న కాలమే తేలుస్తుంది.