ఈమధ్య సినిమాలపైనే కాకా రాజకీయాలపై కూడా స్పందిస్తున్నారు ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్.. పోయిన వారంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను విమర్శిస్తూ మానవహక్కుల కమిషన్ ను కూడా కలిసిన కత్తి, నిన్నటికి నిన్న ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడుతూ సోషల్ మీడియాలో వ్యంగంగా పోస్టులు పెడుతూండటం మనం చూసాం.. ఇవన్నీ ఒక ఎత్తయితే నేడు చేసిన విమర్శలు మరో ఎత్తు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కాపుల రిజర్వేషన్ లు , బీసీ సంఘాల ఆందోళనలపై కత్తి మహేష్ సోషల్ మీడియాలో స్పందించారు.. అసలు కత్తి మహేష్ ఏమన్నారో అయన మాటల్లోనే చూద్దాం..
"తాంబూలాలు ఇచ్ఛేసాం ఇక తన్నుకుచావండి అన్న చంద్రబాబు. కాపు రిజర్వేషన్లపై కాపులకే పెద్ద కన్ఫ్యూజన్. భోజనం అడిగితే టిఫిన్ పెట్టాడన్న ముద్రగడ. బిసి రిజర్వేషన్లలో వాటా ఇచ్చేది లేదన్న కృష్ణయ్య. కేంద్రం అదనంగా 5% కాపులకి ఇక్కడ ఇస్తే జాట్లు, పటేళ్లు, గుజ్జర్లు ఖచ్చితంగా ఆందోళనలు చేస్తారని తెలిసిన మోడీ. ఇవన్నీ తెలిసీ తెలియని స్థితిలో ఎలా స్పందించాలో అర్థం కాని పవన్ కళ్యాణ్. ఈ అవకాశాన్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలని మల్లగుల్లాలు పడుతున్న ప్రతిపక్షం. అబ్బా...ఎంత ఆసక్తికరం ఆంధ్రప్రదేశ్ రాజకీయం" అంటూ ఏపీ రాజకీయాలపై అయన స్పందించారు..