కొన్ని సినిమాలు మన సమాజం లోని లోపలను ఎత్తి చూపెడతాయి...అలాంటి సినిమానే....కంచె. ఈ సినిమా 2015 అక్టోబరు 22 న విడుదలైన సినిమా.[. ఈ చిత్ర కథ రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో వచ్చిన మొదటి సినిమా ఇది. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండు లక్షల మంది భారత సైనికులు పాల్గొని, నలబై వేల మంది మరణించి, మరో ముప్ఫై ఐదు వేల మంది గాయపడి, అరవై వేలమంది బందీలుగా చిక్కారన్న సత్యాన్ని పరిశోధనాత్మకంగా వెలికి తీసి, ప్రపంచం ముందు పెట్టిన సినిమా ఇది[2]. ఆగస్టు 15, 2015 న విడుదలైన ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రం విభిన్నంగా ఉండి ఆకట్టుకున్నది. మీరు ఇప్పటివరకు చూడకుంటే మాత్ర్రం తప్పక చూడండి. శ్రీ.కో.