పవర్ స్టార్ పవన్ వెళ్తాడట,
2019 ఎన్నికల్లో పొత్తుకి,
లెఫ్ట్ పార్టీకే చెప్పాడట రైట్ అని,
కలిసి పోరాడితే పోయేది,
ఏముందని అనుకున్నారేమో బహుశా! శ్రీ.కో
వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేయాలని జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో వామపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ, పొత్తుపై కూడా చర్చించారు. ఈ భేటీలో 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. వారం రోజులలో విజయవాడలో జనసేన, లెఫ్ట్ పార్టీల ప్రత్యేక సదస్సు జరగనుంది. భూసేకరణ, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రజా సమస్యలు, పరిష్కారం అజెండాను ఖరారు చేయనున్నారు. వీరు ఉమ్మడి అజెండాతో ముందుకు సాగనున్నారు.