అండర్సన్ గూబ గుయ్యిమంది..

Update: 2018-08-07 01:49 GMT

ఎప్పుడు క్రికెట్ ఆడితే మజా ఏముంటుంది.. ఈసారి గోల్ఫ్ ఆడుదాం అనుకున్నాడు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జేమ్స్ అండర్సన్. అంతే అనుకున్నదే తడవుగా సహచర ఆటగాడు బ్రాడ్‌ తో కలిసి బకింగ్‌హమ్‌షైర్‌లోని ఓ గోల్ఫ్‌ కోర్సుకు వెళ్లారు. అక్కడ అండర్సన్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా.. బ్రాడ్‌ వెనకాలే ఉండి వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఆండర్సన్ గోల్ఫ్‌ స్టిక్‌తో బంతిని బలంగా కొట్టగా.. కింద ఉన్న ఓ చెక్క ముక్క తగిలి బంతి తిరిగి అండర్సన్‌ చెవి, ముఖానికి మధ్య ప్రదేశంలో తాకింది. దెబ్బ గట్టిగ తగలడంతో అండర్సన్‌ విలవిలలాడిపోయాడు. కాసేపటికి తేరుకుని మళ్ళీ యాధస్థితికి వచ్చాడు. కాగా వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చెయ్యడంతో అది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన అండర్సన్ అభిమానులు అతనికి ఏమైంది, ప్రస్తుతం ఆరోగ్యం ఎలావుందీ అని కామెంట్లు పెడుతుండటం గమనార్హం. 

Similar News