ఓ వైపు పార్లమెంట్ లో టీడీపీకి చెందిన ఎంపీలు అయ్యా బాబూ మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. కనికరించండి. మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నా అందుకు కట్టుబడి ఉన్నాం . విభజన హామీల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీదేనంటూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికార పార్టీ నేతలపై , అధినేతపై మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన సభలో మాట్లాడిన జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పాదయాత్రలు, బంద్ లు, యువభేరి కార్యక్రమాలు చేస్తుంటే దెబ్బ తగిలిన చోట కారం చల్లుతారా అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు తనకు ఒకటి అనిపిస్తుందనీ… ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేయాలీ, ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్లి ఆనందంగా కూర్చుంటే మేలు కదా అని తనకు అనిపిస్తుందని జగన్ చెప్పడం జరిగింది..!
మరి చంద్రబాబు పనితీరును ప్రశ్నించిన జగన్ తన పార్టీ తరుపున రాష్ట్రానికి ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారిందని టీడీపీ నేతలు అంటున్నారు. తాము పార్లమెంట్ లో రాష్ట్రంకోసం ఫైట్ చేస్తుంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామన్నారు. ఆ రాజీనామాలు ఎంతవరకు వచ్చాయి. పైపెచ్చు తాము రాజీనామా చేస్తే రాష్ట్రంకోసం ఎవరు పైట్ చేస్తారు అని అంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. పోలవరం విషయంలోనూ ఇదే ధోరణి. టెండర్ల విషయమై కేంద్రం మోకాలడ్డే ప్రయత్నం చేస్తే… ఆ సమయంలో వేరే రకంగా ఫిర్యాదులు చేశారు. పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి చంద్రబాబును తప్పించేయండీ అని కోరారు. అమరావతికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటే… కమిషన్ల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఇలా అధికార పార్టీ చేస్తున్న ప్రతీ పనిలో అవినీతిని వెతుకుతున్న వైసీపీ రాష్టం కోసం నాలుగేళ్లుగా ఏం చేస్తున్నదనేది ప్రశ్నార్ధకమే