ప్రేమలో విఫలమైనవారు, చాల మంది మందు బాబులు, ఇంకా... బంధాలో బలిఅయిపోయినవారు.... ఇప్పటికి పాడుకునే పాట...”జగమే మాయ బ్రతుకే మాయ” పాట 1953 లో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాల రచించారు. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు హృద్యంగా గానం చేయగా సి.ఆర్. సుబ్బరామన్ సంగీతాన్ని అందించారు.
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతే నయా ||| జగమే మాయ |||
చరణం 1 :
కలిమీలేములు కష్టసుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి ||| కావడి కొయ్యేనోయ్ ||| ||| జగమే మాయ |||
ఈ పాట మీరు ఇప్పటికి వినకుంటే ఒక్కసారి ఆ పాట విని ...ఆ కిక్కు ఏంటో అనుభవించండి. శ్రీ.కో.