ఇమ్రాన్ అనే నేను...

Update: 2018-07-30 12:35 GMT

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా,
నేనే ప్రమాణస్వీకారం చేస్తా,
 కావాల్సినంత మెజారిటీకి,
కెప్టెన్సీ చేసి మరీ నిలుస్తా, 
అనెను కదా ఇమ్రాన్. శ్రీ.కో

పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేస్తానని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ వెల్లడించారు. ఈ నెల 25న జరిగిన పాక్‌ జాతీయ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు చర్చలు జరుపుతున్నామని.. వచ్చే నెల 11న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు.

Similar News