నేటి పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోల్ లో పడవ ప్రమాద బాధిత మృతుల కుటుంబాలను పరామర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ , ప్రమాదం జరిగిన సమయంలో నేను దూరంగా ఉన్నాను చాలా దుఃఖం అనిపించింది,మిమ్మలను ఇలాంటి సందర్భంలో కలవటం బాధగా ఉందని అన్నారు.. కుటుంబంలో వ్యక్తిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు వ్యక్తిగతంగా తెలుసు, ఇంతటి దుఃఖం లో ఉన్న మిమ్మలను ఓదార్చడానికి వచ్చానని పవన్ అన్నారు, ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.. కాగా మృతుల కుటుంబ సబ్యులు మాత్రం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినదని పవన్ కు వివరించారు..