కొన్ని సినిమాల కథలు, సినిమా మనం చూసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనతోనే వుంటాయి...అలాంటి సినిమానే ఈ ఇది కథ కాదు సినిమా. ఈ సినిమా 1979లో విడుదలైన ఒక చక్కని తెలుగు సినిమా. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. వెంట్రిలాక్విజం ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. చిరంజీవి ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి. మీరు ఇప్పటి వరకు ఈ సినిమా చూడకుంటే మాత్రం తప్పక చూడండి. శ్రీ.కో.