ఇక వారాంతం వస్తే,
బారుల్లో పబ్బుల్లో దోస్తీ,
అర్దరాత్రి ఒంటిగంట వరకు మస్తీ,
ఇది ఇస్తుంది ఖజానాకి జాస్తి,
ఆ తర్వాత రోడ్లపై కుస్తీ,
ఇది ప్రభుత్వాలకి పట్టిన సుస్తీ. శ్రీ.కో.
మద్యం ప్రియులకు శుభవార్త, ఇక బార్లలో అర్ధరాత్రి తర్వాత కూడా, మరింత సమయాన్ని గడపవచ్చు ,బార్ల సమయాన్ని అదనంగా గంటసేపు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పటిదాకా రాత్రి 12 గంటల తర్వాత మూసేసుకునే బార్లు, ఇప్పుడు ఒంటిగంట వరకు తెరిచి తమ వ్యాపారాన్ని చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది.