గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే అధికార పీఠం దక్కించుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గుజరాత్‌లో హోరాహోరీ పోరు సాగినా బీజేపీ తిరిగి అధికారపగ్గాలు చేపడుతుందని స్పష్టం చేశాయి. 182 సీట్లున్న గుజరాత్‌లో బీజేపీకి 108, కాంగ్రెస్‌కు 74 సీట్లు దక్కుతాయని సీ ఓటర్ అంచనా వేసింది. టైమ్స్ నౌ బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 70, ఇతరులకు 3 సీట్లు వస్తాయని లెక్కగట్టింది. సహారా సమయ్ బీజేపీకి 110 నుంచి 120, కాంగ్రెస్‌కు 65 నుంచి 70 స్ధానాలు వస్తాయని పేర్కొంది. ఏబీపీ న్యూస్ బీజేపీకి 91-99, కాంగ్రెస్‌కు 78-86, ఇతరులకు 3-7 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక సీఎన్‌ఎన్- ఐబీఎన్ బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 70, ఇతరులకు 3 స్ధానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి 115, కాంగ్రెస్‌కు 65 ఇతరులకు 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక నిర్మాణ టీవీ బీజేపీకి 104 స్ధానాలు, కాంగ్రెస్‌కు 74, ఇతరులకు 4 స్ధానాలు లభిస్తాయని పేర్కొంది.