వేడెక్కుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు

Update: 2018-07-05 07:38 GMT

ముందస్తు ఎన్నికల అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు సవాళ్లు, ప్రతిసవాళ్ళు విసురుకుంటున్నాయి. అయితే ముందస్తుకు  తెలంగాణ కాంగ్రెస్ అధినేతకు ఎందుకంత తొందర..? తన పదవిని కాపాడుకునేందుకే ముందస్తు హడావిడి చేస్తున్నారా..? అందుకే అధికార పార్టీ సవాల్ కు ప్రతిసవాల్ చేస్తూ రాజకీయ వేడి పుట్టించడానికి ప్లాన్ వేస్తున్నారా...? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ముందస్తు ఎన్నికల ప్రచారం కొత్త  పంచాయితీకి తెరతీస్తోంది పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవి కాపాడుకునేందుకే ముందస్తు ఎన్నికల అంశాన్ని వాడుకుంటున్నారని పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది.. సీఎం కేసీఆర్ సవాల్ విసిరిన తరువాత రోజు.. కనీసం పార్టీ నేతలతో కూడా చర్చించకుండా ఉత్తమ్ ముందస్తు ఎన్నికలపై స్పందించడం వెనుక ఇలాంటి జిమ్మిక్కులే ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. 

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు పీసీసీ తీరును వ్యతిరేకిస్తూ అదిష్ఠానం గడప దొక్కారు. ఇక ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ అధిష్టానంలో భారీ మార్పులు చేస్తామన్నారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు సవాలు చేయడంతో పీసీసీ అదే హీట్ కొనసాగించటానికి పరుగులు తీస్తోందని కాంగ్రెస్ పార్టీలో చర్చ ఆగస్ట్ వరకూ కాస్త హడావిడి చేస్తే ఇక తన పదవికి గండం ఉండదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ భావిస్తున్నారు. 

అయితే అధికార పార్టీ సైతం ఉత్తమ్ కు మేలుగా ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని తెరపైకి తెచ్చిందన్న వాదన కూడా ఉంది మరో వైపున ఎట్టి పరిస్థితిలోనూ టీపీసీసీ చీఫ్ ను మార్చాలని లేదా అధికారాలు కట్  చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి టీపీసీసీ చీఫ్ ను ముందస్తు ఎన్నికల అంశం ఎంతవరకూ కాపాడుతుందో చూడాలి. 

Similar News