వనోచ్చేనంటే వరదోస్తది..బురద తెస్తది

Update: 2018-08-16 10:11 GMT

రాష్ట్రంలో నేడు పలుచోట్ల ముంచేత్తుతాయట,

భారి ఎత్తున రాబోతున్న నేటి వర్షాలు,

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెప్పేనట,

ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వాయుగుండాలు. శ్రీ.కో. 

రాష్ట్రంలో నేడు పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కొన్నిచోట్ల 10 సెంటీమీటర్లకు పైగా కురుస్తాయని అంచనా. బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం తీవ్రమై వాయుగుండంగా మారి భువనేశ్వర్‌కు సమీపంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 18 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి వాయుగుండంగా బలపడిన క్రమంలో దక్షిణాదిలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆంధ్ర, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో అల్లాడి పోతున్నాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కుళాయి నుండి వస్తున్నా నీరుల వర్షం పడుతూనే వుంది
 

Similar News