ప్రస్తుత టెస్ట్ క్రికెట్లో... ఏకైక తెలుగు ఆటగాడు హనుమ విహారి....తన అరంగేట్రం టెస్టు మ్యాచ్ ల్లోనే...సత్తా చాటుకొన్నాడు. ఓవల్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన ఆఖరిటెస్ట్...తొలి ఇన్నింగ్స్ లో ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించిన విహారీ...ఆఫ్ స్పిన్నర్ గా మూడు వికెట్లు పడగొట్టి ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకొన్నాడు. అయితే...రెండో ఇన్నింగ్స్ లో మాత్రం విహారీ డకౌట్ గా వెనుతిరగక తప్పలేదు.. ఇంగ్లండ్ తో పాంచ్ పటాకా టెస్ట్ సిరీస్ ఆఖరి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన తెలుగుతేజం హనుమ విహారీ...తన తొలిమ్యాచ్ లోనే ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకొన్నాడు.
దేశవాళీ క్రికెట్ తో పాటు....ఇండియా-ఏ జట్టు తరపున నిలకడగా రాణిస్తూ వచ్చిన 24 హనుమ విహారి...రాహుల్ ద్రావిడ్ శిక్షణలో నాణ్యమైన బ్యాటింగ్ తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో...కెప్టెన్ కొహ్లీ మినహా మిగిలిన స్టార్ బ్యాట్స్ మన్ అంతా ఘోరంగా విఫలమైన సమయంలో.... హనుమ విహారికి భారతజట్టులో చోటు దక్కింది. అంతేకాదు...ఓవల్ టెస్ట్ కు ఎంపిక చేసిన తుదిజట్టులో...పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా స్థానంలో విహారిని ఎంపిక చేశారు.
దీంతో...గత ఎనిమిది దశాబ్దాల కాలంలో భారతటెస్టు జట్టులో చోటు సంపాదించిన మూడో ఆంధ్ర క్రికెటర్ గా హనుమ విహారి రికార్డుల్లో చేరాడు. 1932లో కర్నల్ కొఠారి కనకయ్య నాయుుడు, 1999లో ఎమ్మెస్కే ప్రసాద్ తర్వాత...టెస్ట్ క్యాప్ అందుకొన్న ఆంధ్ర క్రికెటర్ గా విహారి తన ప్రస్థానం ప్రారంభించాడు. అంతేకాదు.. కీలక ఆరవస్థానంలో బ్యాటింగ్ కు దిగిన విహారి ఆరంభంలో తడబడినా ఆ తర్వాత కుదురుకొని ఆడి ...124 బాల్స్ ఎదుర్కొని ఓ సిక్సర్, 7 బౌండ్రీలతో 56 పరుగుల స్కోరుకు...ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ బౌలింగ్ లో అవుటయ్యాడు. టెస్ట్ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్ లోనే...అర్థశతకం సాధించిన 26వ భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. అంతేకాదు...ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ ప్రత్యర్థిగా ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్ గా నిలిచాడు.
గతంలో ...అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్లలో రూసీ మోడీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ఈ ముగ్గురి సరసన..ఇప్పుడు సరికొత్తగా ...హనుమ విహారీ వచ్చి చేరాడు. అంతేకాదు...ఇంగ్లండ్ రెండోఇన్నింగ్స్ లో భారత ప్రధాన బౌలర్లంతా గతి తప్పిన తరుణంలో...పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ గా బౌలింగ్ కు దిగిన విహారి...తన కెప్టెన్ ను ఏమాత్రం నిరాశపరచలేదు. కుదురుగా బౌలింగ్ చేసి...ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. సెంచరీ హీరోలు జో రూట్, అలీస్టర్ కుక్, మిడిలార్డర్ ఆటగాడు కరెన్ లను...విహారీ అవుట్ చేశాడు. బ్యాటింగ్‌లో ఫైటింగ్ హాఫ్ సెంచరీ...బౌలింగ్ లో మూడు కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా....విహారీ తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ ను చిరస్మరణీయం చేసుకోగలిగాడు.