కొన్ని సినిమాలు పోలీస్ వృత్తికీ చాల గౌరవం తీసుకువస్తాయి... అలాంటి సినిమా ఈ ఘర్షణ సినిమా. ఈ ఘర్షణ 2004 లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ కథాచిత్రం. ఇందులో వెంకటేష్, ఆసిన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది గౌతమ్ మేనన్ ముందుగా తమిళంలో తీసిన కాక్క కాక్క అనే చిత్రానికి పునర్నిర్మాణం. తమిళంలో సూర్య, జ్యోతిక జంటగా నటించారు. హ్యారిస్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ పాత్రలో అసలైన పోలీసులా కనిపించడం కోసం వెంకటేష్ హైదరాబాద్ పోలీస్ అకాడమీకి వెళ్ళి వాళ్ళ నడవడిని గమనించాడు. శరీరాకృతిని కూడా దానికి తగ్గట్టు మార్చుకున్నాడు. ఈ సినిమాలో మొదటగా కథానాయిక పాత్రకు సోనాలీ బెంద్రేని అనుకున్నారు. తర్వాత ఆ అవకాశం ఆసిన్ కు దక్కింది. ఈ సినిమా మీరు ఇప్పటి వరకు చూడకుంటే మాత్రం...ఒక సారి తప్పక చూడవచ్చు. శ్రీ.కో.