ప్రత్యక్ష రాజకీయాల్లోకి గద్దర్ ఎంట్రీ...

Update: 2018-08-03 05:54 GMT

రాజకీయ ఎంట్రికి సిద్ధంగా ఉన్నానంటు ప్రకటించిన ప్రజాయుద్దనౌక గద్దర్ 2019 నే టార్గేట్ గా పెట్టుకున్నారా ఆయన పొలిటికల్ ఎంట్రి ఎక్కడ నుండి ఉండబోతుంది. 2019 లో గద్దర్ ఏ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న గద్దర్ పొలిటికల్ ఎంట్రి పై స్పెషల్ స్టోరి..
 
తన ఆట పాట లతో ప్రజలను చైతన్య పరిచిన గద్దర్ ఎన్నికలకు సిద్దమంటు చాలా రోజుల క్రితం ప్రకటించారు అయితే ఎక్కడ నుండి పోటి చేస్తారనేది మాత్రం అప్పుడు చెప్పలేదు ఓ వైపు ముందస్తు సంకేతాలు మరోవైపు అన్ని పార్టీలు అభ్యర్దులను ఫైనల్ చేసుకుంటున్న ఈ తరుణంలో గద్దర్ కూడా తన పొలిటికల్ ఎంట్రీ పై సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేస్తారంటూ చర్చ సాగుతోంది. దీనిని గద్దర్ సైతం ఖండించకపోవడంతో  జిల్లాలో ఎక్కడి నుంచి గద్దర్ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నారనేది ఆసక్తి కరంగా మారింది. 

తెలుగు రాష్టాలతో పాటు దేశంలోని చాల రాష్ట్రాలకు పరిచయం అవసరం లేని వ్యక్తి గద్దర్. భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అంటు అడవి బాట పట్టి తన ఆట పాటలతో విప్లవ పంథాను కొనసాగించిన ప్రజా యుద్దనౌక. అణగారిన వర్గలను తన పాటతో చైతన్యం తీసుకువచ్చి పోరుబాట పట్టించడమే కాదు రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసి పాలక ప్రభుత్వాలను సైతం తన పాటతో వణింకించిన విప్లవ కారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశం చేయడంలోను పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోవడం లోనూ గద్దర్ ప్రముఖ పాత్ర పోషించే వాడని నిఘా వర్గలు సైతం అనేక సార్లు వెల్లడించడంతో గద్దర్ కరుడుగట్టిన కమ్యూనిస్టుగా ముద్ర పడ్డారు. అలాంటి గద్దర్ మారుతున్న పరిణామాలతో మావోయిస్టు పార్టీకి దూరం అయి ప్రజా క్షేత్రంలో ప్రత్యేక పోరాటాలను కొనసాగిస్తు తన ఆట పాటలతో పాలక ప్రభుత్వాలను నిలదీస్తునే వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చాల వేదికల పై గద్దర్ తన గొంతుకతో లక్షల మందిని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లించిన ఘనత ఉంది. గతంలో రాజకీయంగా గద్దర్ కు చాల అవకాశాలు వచ్చినప్పటికి కారణాంతరాలవల్ల ఎన్నికలకు దూరంగా ఉంటు వచ్చారు. తాను నమ్మిన సిద్దాంతానికి వ్యతిరేకమనే భావన వల్లనే గద్దర్ ఇన్నాళ్లూ ఎన్నికల్లో పోటి చేయడానికి ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 2019 ఎన్నికల్లో గద్దర్ ఎన్నికల్లో పోటి చేసేందుకు  సిద్దమయ్యారు.

గతంలో కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తనను ఆదరించాలంటు ప్రజలను వేడుకోవడం వంటి పరిణామాలన్ని గద్దర్ ఎన్నికల్లో పోటికి సిద్ధపడుతున్నారనే సంకేతాలను ఇచ్చాయి. గద్దర్ పై కాల్పలు జరిపి 25 ఏళ్లు అయిన సందర్బంగా దళిత సంఘాలు,ఆయన అభిమానులు పునర్జన్మ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ తన మనుసులోని మాట ఆ కార్యక్రమంలో బయటపెట్టారు. 2019 ఎన్నికల్లో రాజకీయలను ప్రక్షాళన చేస్తానని ఇక మీదట ప్రజలను రాజకీయ శక్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్పిన గద్దర్ వచ్చే ఎన్నికల్లో పోటి చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఈ వేదిక ద్వారానే ప్రకటించారు. 

ఆ తరువాత కూడా పలుమార్లు టి మాస్ తో కలిసి జిల్లాలో గద్దర్ పర్యటించారు వ్యక్తిగత కార్యక్రమాల్లోను ఆయన కరీంనగర్ జిల్లాకు వచ్చారు. అయితే ఇటీవల కోరుట్లలో జరిగిన టిమాస్ కార్యక్రమానికి వచ్చిన గద్దర్ ను ఎక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించినా మౌనంగా ఉండిపోయారు. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా లేదంటే ఖమ్మం జిల్లా  నుండి  పోటీ చేస్తారంటు ప్రచారం మొదలైయ్యింది. గద్దర్ పొలిటికల్ ఎంట్రీ పై జిల్లాలో ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది. అయితే ఆయన ఏ నియోజకవర్గం నుండి చేస్తారనే అంశంపై మాత్రం క్లారీటి లేకుండాపోయింది పెద్దపల్లి నుండి ఎంపిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్న వార్తలు వినిపించాయి అభిమానుల సందేహాలకు తెర దించుతూ మరికొన్ని రోజుల్లోనే గద్దర్ నుంచి స్పష్టమైన ప్రకటన ఆశించవచ్చంటున్నారు గద్దర్ సన్నిహితులు. 

Similar News