తెరపైకి అబ్దుల్ కలామ్ బయోపిక్

Update: 2018-12-26 08:18 GMT
తెరపైకి అబ్దుల్ కలామ్ బయోపిక్
  • whatsapp icon

ఇప్పుడు ఏ సినీ రంగంలో చూసిన బయోపిక్‌ల ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లోనూ బయోపిక్ ల మీద బీజీబీజీగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిల మీద తెరకెక్కుతున్న బయోపిక్ లు మొత్తానికి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఇక కాంతారావు బయోపిక్ కూడా సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ బయోపిక్‌ను నిర్మించడానికి భారీ సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం. కలాం జీవితచర్రిత మీద తను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి భారతదేశం గర్వించదగిన గొప్ప శాస్త్రవేత్తగా ఎలా ఎదిగారు అనే విషయంపై ఈ బయోపిక్ కొనసాగుతుందని అంటున్నారు. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ అబ్దుల్ కలాం సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. అబ్దుల్ కలామ్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా చెబుతున్నారు. ఇటివలే ఎంఎస్ ధోని, మహానటి సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Similar News