ఆరోగ్యానికి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లాగానే సినిమా సక్సెస్కి, తెలుగు సినిమా ఇందుస్త్రీలో మల్టీస్టారర్లు ప్రయోగాలూ ఎప్పటినుండో పనిచేస్తున్నాయి. అలా నాగ్..నాని.. కలిపి కొట్టిన కాక్టెయిల్ నేటి దేవ..దాసు. కథలో కొంచెమే కొత్తదనం వున్నా కుడా... రెండున్నర గంటలపాటు వినోదం మరియు కథని సోడా విస్కీ లా బాగానే కలిపారు. ఇలా హాస్యం, భావోద్వేగం, యాక్షన్ కలగలిపిన ఓ కమర్షియల్ కాక్టెయిల్ ‘దేవ’దాస్’. ప్రాణాలు తీయడంలో గోప్పలేదు...ఒక ప్రాణాన్ని కాపాడటంలోనే గొప్ప వుంది అని చూపే సినిమా. ఇదే ఈ సినిమా ప్రధానాంశం. ఒక్కో సీను...ఒక్కో ...పెగ్గులా సరదా సరదా వినోదం యొక్క డోస్ పెంచుతాయి. నాగార్జున, నాని స్టార్‌డమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. నాగ్, నాని మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా బాగుంది. ముఖ్యంగా నాని నటన...టకీలా ఆపకుండా తాగితే వచ్చే కిక్ లా , నిమ్మకాయ, ఉప్పులా అధర గొట్టి అధరాలపై నవ్వుని తెచ్చింది. మిగిల పాత్రలన్నీ మందులో మంచింగ్ లాంటివే... అవి కూడా కొంచెం కామెడీ, ఎమోషన్ అన్నీ పండించాయి. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంతంగా కూచొని.. కొంత నవ్వులతో... కిక్ కావాలంటే మాత్రం.. తప్పక దేవా దాసు లను మీ దగ్గర ధియేటర్లో కలిసి చీర్స్ చెప్పండి. శ్రీ.కో.