బాలీవుడ్ ప్రేమజంట దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని లేక్ కోమోలో వీరి వివాహం ఈరోజు కొంకణి సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. బుధవారం సంప్రదాయంలో మరోసారి వీరి వివాహం జరగనుంది.. హాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ ప్లేస్, అత్యంత ఖరీదైన హాలీడే స్పాట్ ఇటలీలోని లేక్ కోమో వీరి పెళ్లికి వేదికైంది.. దీపికా సారస్వత్ బ్రాహ్మిణ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు ఆమె మాతృభాష కొంకణీ. దీంతో మొదట కొంకణీ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు సాయంత్రం 3 గంటలకు ముగిసినట్లు తెలుస్తోంది.
వీళ్ల వివాహానికి అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి కోసం దీపికా వైట్ అండ్ గోల్డ్ సబ్యసాచి చీరలో ముస్తాబవగా.. రణ్‌వీర్ కంజీవరం షేర్వాణీలో మెరిసిపోయాడు. లేక్ కోమో తీరంలో ఏర్పాటుచేసిన వివాహ విందు ఫొటోలు, పెళ్లిదుస్తుల్లో రణ్‌వీర్, దీపిక ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఇవాళ ఈ ఇద్దరూ సింధి సాంప్రదాయంలో మరోసారి పెళ్లి చేసుకోనున్నారు. ఇక వీరి వివాహం గురించి మరో ఆసక్కికర విషయం తెలుస్తోంది.. దీపికా రన్ వీర్‌లు వివాహానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు... దీప్‌వీర్ జంట విదేశాల్లో వివాహం చేసుకుంటున్నారు కాబట్టి ముందుగా వీరి పెళ్లికి బీమా చేయించారట. ఈ విషయాన్ని ఫిల్మ్‌ఫేర్ అనే సంస్థ వెల్లడించింది. మరోవైపు పెళ్లి జరిగే ప్రాంతం వద్ద భారీ సెక్యూరిటీని విధించారు. వివాహానికి వచ్చే అతిథులు తప్పకుండా శుభలేఖలు తీసుకురావాలని, చేతికి రిస్ట్ బ్యాండ్స్ ధరించాలని నిబంధనలు విధించారు. ఇక ఈ నెల 21న బెంగళూరులో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటుచేయనున్నారు.