మన ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ !

Update: 2018-10-15 10:59 GMT

దాన వీర శూర కర్ణ  DVS Karna చాలా విధాలుగా రికార్డులు సృష్టించిన తెలుగు సినిమా. ఇది 1977 సంవత్సరంలో విడులైన పౌరాణిక చిత్రం. ఇది నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకటకవి కలసి సృష్టించిన సంచలన చిత్రం. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా పూర్తిగా ఎన్.టి.ఆర్. శ్రమ ఫలితం. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కథానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. 4 గంటల 24 నిమిషాల నిడివి గలిగిన ఈ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లో పూర్తి అయ్యింది. ఇంత భారీ చిత్రం కేవలం 43 పనిదినాల్లో షూటింగ్ ముగించుకొని విడుదలవ్వటం ఒక ఆశ్చర్యమే కదా! శ్రీ.కో.
 

Similar News