హైదరాబాద్‌లో hmtv హెరిటేజ్ వాక్

Update: 2018-01-26 12:22 GMT

చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణే ధ్యేయంగా hmtv హైదరాబాద్ లో హెరిటేజ్ రన్ నిర్వహించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చార్మినార్ నుంచి ఫలక్‌నుమా వరకు 5కే వాక్ చేసింది. hmtv , హన్స్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన  హెరిటేజ్ రన్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. GHMC కమిషనర్ జనార్థన్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అపురూప చారిత్రక సంపదను కాపాడటానికి hmtv చేస్తున్న ప్రయత్నాన్ని  మహమూద్ అలీ, GHMC కమిషనర్ జనార్థన్ రెడ్డి కొనియాడారు. ప్రతిఏటా వాక్ నిర్వహించడం అభినందనీయమన్నారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందనిపైనా ఉందని ఎంపీ బీబీ పాటిల్ పిలుపునిచ్చారు. 

hmtv , హన్స్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన హెరిటేజ్ వాక్ కార్యక్రమానికి ద్ోణాచార్య పురప్కార గ్రహాత నాగపురి రమేష్, బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ , సినీ నటులు కార్తికేయ, మనాలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రన్‌లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి మోడల్ స్కూల్ సహకారంతో hmtv , హన్స్ ఇండియా హెరిటేజ్ వాక్ చేపట్టాయి. హైదరాబాద్ లో hmtv చేపట్టిన హెరిటేజ్ రన్‌లో కొందరు విద్యార్థులు స్కేటింగ్ చేసి ఆకట్టుకున్నారు. వీరు ఈ కార్యక్రమానికి స్కేటింగ్ చేసిన చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 
 

Similar News