
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ బీటెక్ రవి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బలవంతంగా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ ను కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే, బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎమ్మెల్సీ బీటెక్ రవి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆయనకు తక్షణమే చికిత్స అందించకపోతే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులుదీక్ష హెచ్చరించారు. దీంతో బీటెక్ రవి దీక్షను భగ్నం చేసి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.