"భలే భలే మగాడివోయ్" అనే పాట..మీరు వినే వుంటారు...అదే పేరు తో ఒక సినిమా వచ్చింది... అదే.... "భలే భలే మగాడివోయ్ 2015లో విడుదలైన తెలుగు సినిమా.ఈ సినిమాని గీతా ఆర్ట్స్2 మరియు యు.వీ.క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో వంశి కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, బన్నీ వాసు నిర్మించారు. దాసరి మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాని, లావణ్య త్రిపాఠి ఈ సినిమా హీరో, హీరోయిన్లు, మరియు మురళి శర్మ, అజయ్, నరేష్, సితార,వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే..."లక్కీ" అనే మతిమరుపు ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్త చుట్టూ తిరుగుతుంది. అతడు తన మతిమరుపుని కప్పిపుచుకోవటానికి చేసే పనులు, తన ప్రేమించే అమ్మాయిని చివరికి ఎలా సాధించుకుండానేదే ఈ చిత్ర కథ. ఈ చిత్రం పేరు 1978 లో వచ్చిన సుపర్ హిట్ మరోచరిత్రచిత్రంలో ఉన్న పాట నుండి తీసుకున్నారు. ఈ చిత్ర నిర్మాణం మార్చి 2013 లో ప్రారంభమవ్వగా, ప్రధాన చిత్రీకరణ పనులు జూలై 2015 లో పూర్తయ్యాయి. పోస్ట్-ప్రొడక్షన్ పనులతో కలిపి ఈ చిత్రాన్ని 7 నెలల్లో పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీశారు. ఒక పాట చిత్రీకరణ గోవాలో జరిగింది. 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 700 సెంటర్లలో విడుదలయి, 55 కోట్ల గ్రాస్ తో పెట్టిన పెట్టుబడికి నికరంగా మూడింతలు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. అమెరికా తెలుగు బాక్సాఫీస్ గ్రాస్ లో 4వ స్థానంలో ఉంది. అక్కడ 115 సెంటర్లలో విడుదలయింది ఈ చిత్రం. ఇప్పటి వరకు మీరు ఈ సినిమా చూడకుంటే మాత్రం...ఒక సారి చూసి నవ్వుకోడానికి బాగా వుంటుంది ఈ సినిమా. శ్రీ.కో.