మహాకూటమికి వీరి ప్రచారం ప్లస్ పాయింట్ అవుతుందా?

Update: 2018-11-19 12:15 GMT

రాజకీయాలలో ఏమైనా జరగొచ్చు గెలుపే టార్గెట్ గా రాజకీయ పార్టీలు రంగంలోకి దిగితే సిద్ధాంతాల రాద్ధాంతాలూ మాయమైపోతాయి. ఉమ్మడి ప్రత్యర్ధిని జయించడమే వ్యూహమైతే శతృవులూ మిత్రులుగా మారిపోతారు ప్రజాస్వామ్య అనివార్యత పేరుతో తెలుగు దేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇద్దరు ప్రత్యర్ధులను ఒకే వేదికపైకి తెస్తోంది. మహాకూటమి రోడ్ షోలలో ఒక అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించబోతోంది. 

మొన్నటి వరకూ వారిద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు సైద్ధాంతికంగా బద్ధ విరోధులు. ఇద్దరూ మాస్ మహారాజులే వీరి కాంబినేషన్ లో మూవీ అంటే జనం కేక పెట్టాల్సిందే ఇద్దరూ ఎన్నో హిట్ మూవీస్ లో నటించారు. బాలయ్యకు పర్ ఫెక్ట్ కాంబినేషన్ కర్తవ్యం ఫేమ్ విజయ శాంతేనన్నది అభిమానుల నిర్వచనం..

ఇద్దరూ కలసి ఎన్నో సినిమాల్లో నటించినా మొన్నటి వరకూ రాజకీయాల పరంగా ఇద్దరిదీ చెరో దారి బాలకృష్ణ టిడిపిలో ఉండగా, విజయ శాంతి సొంతంగా పార్టీ పెట్టి ఆపై బిజెపిలో చేరి ఆతర్వాత టిఆరెస్ లో కెళ్లి ఇలా  చాలా రాజకీయ అనుభవం సంపాదించారు. ఆపై చివరాఖర్న కాంగ్రెస్ లో స్థిరపడ్డారు. ఇద్దరికీ జనాన్ని ఉర్రూతలూగించే క్రేజ్ ఉంది వారి స్పీచ్ లకు చప్పట్ల జడివాన కురుస్తుంది ఇలా ఇద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోనంత సరిసమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటులు ప్లస్ నేతలు.

దేశంలో ఏర్పడిన అనూహ్య రాజకీయ పరిస్థితులు వారిద్దరినీ ఒకే కూటమిలో ఇమిడ్చాయి. ప్రజాస్వామ్య అనివార్యత పేరుతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో చేతులు కలిపి తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న ఈ నటులిద్దరూ ఇప్పుడు ఒకే వేదికను పంచుకుంటారా ? ఉమ్మడి శత్రువు అయిన టిఆరెస్, బిజెపీలను దీటుగా ఎదుర్కొంటారా?

చంద్రబాబు, రాహుల్ ఇద్దరూ కలసి హైదరాబాద్ శివార్లలో రోడ్ షోలలో పాల్గొనే విధంగా ఎన్నికల ప్రచారం డిజైన్ చేస్తోంది మహా కూటమి దాంతో టిడిపినుంచి బాలకృష్ణ, కాంగ్రెస్ నుంచి విజయ శాంతి కూడా ఒకే వేదికను పంచుకోబోతున్నారు సెటిలర్లు ఎక్కువగా ఉండే ఏరియాల్లో కాంగ్రెస్, టిడిపి కలిపి చేసే ప్రచారంలో బాలయ్య, విజయ శాంతి కూడా పాల్గొంటారు. ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఈ కాంబినేషన్ తెలంగాణలో మహాకూటమిని పవర్ లోకి తెస్తుందా ? ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నికల స్పీచ్ లు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

Similar News