స్నేహబంధం ఎంత మధురం

Update: 2018-08-17 08:07 GMT

వాజ్‌పేయితో అద్వానీ సుదీర్ఘ స్నేహబంధం,

అందమైన మరియు అపూర్వమైనా సంబంధం,

అద్వానీ గారి ఆత్మ మిత్రుడి మృతి వార్త, 

మాటలు రానంత బాధలో వారి మనసు ఆర్ధత.  శ్రీ.కో. 


అటల్ జీ మృతి ఆయన ఆత్మ మిత్రుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని తీవ్రంగా కలచి వేసింది. 65 ఏళ్ల పాటు స్నేహంతో మెలిగిన వీరిద్దరూ ఆరెస్సెస్‌లో ప్రచారక్ స్థాయి నుంచీ వారిద్దరూ కలసి పనిచేశారు.
గతకొంత కాలంగా వాజ్ పేయిని తరచుగా కలిసే అద్వానీ ఆయన లేరనే వార్తను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఆప్త మిత్రుడిని కోల్పోవడంతో మాటలు రావడం లేదని అద్వానీ వ్యాఖ్యానించారు. వాజ్‌పేయితో సుదీర్ఘ స్నేహబంధం అపూర్వమైంది. వాజ్‌పేయి తాను యువకులుగా ఉన్నప్పుడు స్కూటర్‌పై తిరిగే వాళ్లమంటారు అద్వానీ. తాము ఇద్దరం కలిసి పానీపూరీ చాట్ తినేందుకు ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌కు వెళ్లేవారిమని గుర్తుచేసుకున్నారు. భారత దేశ రాజకీయాల్లో తిరుగులేని కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఎదిగిన బీజేపీలో వాజ్‌పేయి, అద్వానీ పాత్ర కీలకం. 1980, ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించిన ఈ దిగ్గజ రాజకీయ నేతలు పార్టీ ప్రస్థానాన్ని అప్పటి నుంచి ప్రారంభించి దేశంలో ఒక శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దారు.
 

Similar News