దేశం ఒక అజాత శత్రువును కోల్పోయిందని,
జనం వేదనను వినిపించే ఓ గొంతును కోల్పోయిందని,
ఓ గొప్ప విశిష్ట పాత్రికేయుడిని పోగొట్టుకుందని,
ఓ మహాకవిని మరియు భావుకుడ్ని కోల్పోయిందని,
వాజ్ పేయి గురించి అమిత్ షా తన బాధని వ్యక్తపరిచారు. శ్రీ.కో.
దేశ రాజకీయం అజాత శత్రువును కోల్పోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. వాజ్‌పేయి విచారం వ్యక్తం చేసిన అమిత్‌షా సాహిత్యం ఓ భావుకుడ్ని కోల్పోయిందన్నారు. పార్లమెంట్ జనం వేదనను వినిపించే ఓ గొంతును కోల్పోయిందని చెప్పారు. జర్నలిజం ఓ విశిష్ట పాత్రికేయుడిని పోగొట్టుకుందని తెలిపారు. వాజ్‌పేయి లేని లోటు అనేక కోణాల్లో ఇలా దేశాన్ని వెంటాడుతూనే ఉంటుందని చెప్పారు. వ్యక్తిగా వాజ్‌పేయి మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి మనతోనే ఉంటుందని పేర్కొన్నారు. వాజ్‌పేయి ఆలోచనలు మనతోనే ఉంటాయన్నారు.