టీడీపీ ఎంపీలకు చంద్రబాబు క్లాస్ పీకారు. నిరాహార దీక్ష పట్ల వెటకారంగా మాడినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో సభాషణల లీకేజీ అంతా కుట్ర అని టీడీపీ ఎంపీలు అంటుంటే అసలు వీడియోను ఎవరు తీశారు...? ఎలా బయటకు వచ్చింది.. అన్న విషయాలపై విచారణ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు.
టీడీపీ ఎంపీలు ఢిల్లీలోని ఓ హోటల్‌లో సమవేశమైన సందర్భంగా మాట్లాడుకున్న మాటలివి. నిరాహార దీక్ష గురించి, విశాఖ రైల్వే జోన్ గురించి చులకనగా మాడ్లడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ వీడియోపై దుమారం రేగడంతో ఎంపీలు మాట్లాడిన తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏది పడితే అది ఎలా మాట్లాడుతున్నారంటూ తలంటారు. టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. సరదాగా కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు.
తమ వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారమయ్యాయని కొందరు ఎంపీలు చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇకనుంచి బాధ్యతగా వ్యవహరించాలని ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఎంపీలకు సూచించారు. అసలు వీడియో తీస్తుండగా గమనించకుండా ఎలా ఉన్నారని తప్పు పట్టారు. అయితే ఎంపీల సంభాషణ వీడియో దుమారం రేపడంతో మురళీమోహన్ స్పందించారు. కొందరు మీడియా మిత్రులు సరదాగా మాట్లాడుకున్న మాటల్ని లీక్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీల సంభాషన వీడియో తీసిందెవరో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే టీడీపీ చేస్తున్న ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఉద్యమాలను నీరుగార్చే ఉద్దేశంతోనే వీడియో లీకేజీ కుట్రలు మీడియా ద్వానే జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.