అప్పట్లో పోలీస్ పాత్ర అంతే అందరికి గుర్తుకు వచ్చే పాత్ర .. సినిమా ...అంకుశం. ఈ అంకుశం అనే సినిమా సెప్టెంబరు 28, 1990 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఎవరు ఉహించని విధంగా... సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా. ఈ సినిమా నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి. అలాగే.. ఈ సినిమాలో రాజశేఖర్, జీవిత ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడు రామిరెడ్డి సినీ రంగ ప్రవేశం చేశాడు. రామిరెడ్డి మానరిజం...అలాగే.. మాట తీరు విభిన్నం గా వుండి... ఒక కొత్తదనానికి మూలం అయ్యింది... అలాగే..ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసరుగా రాజశేకర్ ..అక్కడి అవినీతి పరులైన గూండాల నుంచి రాష్ట్రాన్ని రక్షించడం ప్రధాన కథ.. అలాగే.. ఇందులో ఒక పాట అయిన...ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారంని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి పడారు..ఈ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి సినిమాకి ఒక సంపదలా నిలిచింది.. మీకు.. పోలీస్ సినిమాలు ఇష్టం వుంటే.. తప్పక ఈ సినిమా చుడండి. శ్రీ.కో.