రజనీకాంత్ టిజరు యుట్యూబ్లో రచ్చ

Update: 2018-09-19 11:31 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ నాయకుడుగా,

హింది అక్షయ్ కుమార్ ప్రతినాయకుడుగా,

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ చిత్ర దర్శకుడిగా,

‘2.o’ మూవీ టీజర్ వచ్చిందట ప్రత్యేకంగా. శ్రీ.కో. 


సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న, రోబో2. సినిమా, దీనినే ‘2.o’ మూవీ టీజర్ వినాయక చవితి కానుకగా విడుదలై సోషల్ మీడియాను చక్కర్లు కొడుతుంది.. సెప్టెంబ‌ర్ 13 ఉద‌యం 9 గంట‌ల‌కు విడుద‌లైన ‘2.o’ టీజ‌ర్ కేవలం గంట వ్యవధిలోనే 30 లక్షలకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్స్ నమోదు చేసిందట. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలైన ఈ టీజర్ మూడు భాషల్లోనూ యూట్యూబ్‌ని దుమ్ము లేపుతుంది. మొదటి 24 గంటలలోనే తమిళ్‌లో 9.4 మిలియన్ వ్యూస్, హిందీలో 10.3 మిలియన్ వ్యూస్, తెలుగులో 5.1 మిలియన్ వ్యూస్ సాధించినట్టుగా లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్‌లో అఫీషియల్‌గా ప్రకటించింది. రజని అభిమానులు ఎంతో ఓపికతో ఎదురుచూస్తున్న సినిమా ఇది.

Similar News