Yanamala Ramakrishna fire on AP Govt: ఫోన్ ట్యాపింగ్ లో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి: యనమల రామకృష్ణుడు
అమరావతి:
యనమల రామకృష్ణుడు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత:
- ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే, డిజిపి, హోంమంత్రి భుజాలు తడుముకోవడం ఏమిటి..?
- ఏపిలో ఫోన్ ట్యాపింగ్ లలో, సుప్రీంకోర్టు పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా..?
- ఆర్టికల్ 19,21ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘనే, కేంద్ర చట్టాల ఉల్లంఘనే
- ఏపిలో ఫోన్ ట్యాపింగ్ పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను కాలరాయడమే
- ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే, ‘‘రూల్ ఆఫ్ లా’’ ను అతిక్రమించడమే
-ప్రధాని స్పందన దాకా డిజిపి, హోం మంత్రి ఎందుకని ఆగలేక పోయారు..?
- ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, జ్యడిషియరీని బ్లాక్ మెయిల్ చేయడానికి బరితెగించారు
- వాదనలు వినిపించే న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్ కన్నా తీవ్ర నేరం మరొకటి లేదు.
- దేశ భద్రతకు భంగం వాటిల్లిందా ఇక్కడ ఏ అంశంలోనైనా..?
- ప్రజా భద్రతకు భంగం కలిగిందా ఇందులో ఎక్కడైనా..?
- మరి ఏ కారణంతో అడ్వకేట్లు, జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు..?
- ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు అందజేశారా..?
- ముద్దాయే సాక్ష్యాధారాలు ఇవ్వాలని అడగడం ఎక్కడైనా ఉందా..?
- ట్యాపింగ్ పై కేసు పెట్టాలని డిజిపి సలహా ఇవ్వడం మరో విడ్డూరం.
- ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా ఉన్నప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి..?
- డిజిపి, హోంమంత్రి స్పందన ఫోన్ ట్యాపింగ్ పై అనుమానాలను బలపరుస్తోంది