Visakha updates: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది..
విశాఖ..
-దానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తున తుపాను ఆవర్తనం నెలకొంది.
-ఇది రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రకు సమీపంగా పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి పయనించి మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారుతుంది.
-ఆతర్వాత 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ బలపడి వాయుగుండంగా మారి వాయవ్య బంగాళాఖాతంలో ఒడిసా పశ్చిమబెంగాల్ తీరాల్లో కేంద్రీకృతమవుతుంది.
-దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమల్లో రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడ భారీ జల్లులతో ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఆ తర్వాత వర్ష తీవ్రత ఒడిసా, ఆవలి ప్రాంతాలకు మరలుతుంది.
-ఈనెల 22 వరకూ మత్స్యకారులు మధ్య బంగాళాఖాతంలోనికి పోరాదు.
-కర్నాటకలో కూడా రానున్న రెండు మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
Update: 2020-10-21 10:02 GMT