Visakha updates: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు..
విశాఖ..
-సంక్షేమ పథకాలు చంద్రన్న భీమా (ఇప్పుడు వైస్సార్ భీమా ), .భీమా అనేది గతంలో మాదిరిగా ప్రతి కుటుంబంలో పని చేసే ప్రతిఒక్కరికి అందాలి అంతే కానీ ఇంటికి ఒక్కరికే అనే వైఖరి సబబు కాదు
-మా ప్రాంతంలో మగవారు , ఆడవారు ఇద్దరు కూడా పనులకు వెళ్తారు, ఇంటి పెద్దకి మాత్రమే భీమా వర్తింపచేయాలని నిర్ణయం మార్చుకోవాలి
-డ్వాక్రా గ్రూపులు విషయంలో వైస్సార్ ఆశ్ర పేరిట రుణ మాఫీ గతంలో మాదిరిగా అందరికి సమానంగా వర్తించకుండా కొన్ని గ్రూపులకు ఎక్కువ ,కొన్ని గ్రూపులకు త్రక్కువ చేసి రుణ మాఫీ చేసారు
-మీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏర్పడిన కొత్త గ్రూపులకు ఈ సంక్షేమ పథకాలు ఇంకా వర్తించటంలేదు
-ఇటీవల కాలంలో మొదట ఇసుక కొరత , విద్యుత్ చార్జీలు , కరోనా వలన అనేక పరిశ్రమలు చతికిలపడ్డాయి
-ఇటువంటి సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఇప్పటికే మీకు రెండుమార్లు లేఖ వ్రాయడం జరిగింది
-గత మూడు వారాలుగా రాష్టంలో రోజుకు కనీసం ఒక్కటి రెండు చోట్లయినా ప్రార్థన ప్రదేశాలపై దాడులు జరగడం దారుణం
-ఒక్క బాధ్యులను శిక్షించకపోగా , ఇప్పుడు రాష్ట్ర మంత్రి స్థాయిలో ఇటువంటి సంఘటనలను వక్రీకరించి ఒక మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి
-ఇదే ప్రభుత్వ వైఖరి అనే విధంగా మీ మౌనం సందేశం ఇస్తుంది