Vijayawada-Kanaka Durga updates: సింహాలు మిస్ అవ్వడం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము..సోమి నాయుడు..
విజయవాడ:
సోమి నాయుడు, చైర్మన్ దుర్గగుడి:
-2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్ రోడ్ లో ఉన్న రథాన్ని జమ్మిదిడ్డి లో పెట్టారు.
-ఆ తరవాత మహామండపం దగ్గరకు తీసుకొచ్చి పెట్టారు.
-వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రథాన్ని వాడలేదు.
-2019 లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉగాదికి వాడారు, తర్వాత కరోనా వలన వాడలేదు.
-నిన్న కనపడని సింహాలు స్టోర్ రూమ్ లో ఉన్నాయి ఏమో అని గుడి తాలూకా అధికారులు అందరం చెక్ చేసాము.
-కానీ స్టోర్ రూమ్ లో ఆ సింహాలు లేవు.
-పోయిన సింహాలను తయారు చేసి ఆ రథానికి మార్చేందుకు ప్రక్రియ నిన్ననే ప్రారంభించాము.
-గత ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యురిటి అధికారులు ఇప్పుడు వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి ఆ సింహాలు అప్పచెప్పలేదు అని చెప్పారు.
-ఈ రోజు సింహాలు మిస్ అవ్వడం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము.
-పోయిన సింహాలు ఏరకంగా పోయాయి అని పోలీస్ వారిని దర్యాప్తు చేయాలి అని కోరాము.
-హిందువుల మనోభావాలు కపడేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
-నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని మాట్లాడారు.
-గత టీడీపీ-బీజేపీ హయాంలో దేవాలయంలో క్షుద్రపూజలు జరిగినప్పుడు అప్పటి మీ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేసారా.
-ఒక ఎంఎల్సీ గా మాట్లాడేటప్పుడు ఘనం కూడా లేకుండా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు బుద్ధ వెంకన్న.