Vijaaywada Updates: ప్రపంచ బ్యాంక్ నిబంధనల ఆధారిత ప్రాజెక్టులు ఉంటాయి: ఆర్ అండ్ బీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు
విజయవాడ
- ప్రాజెక్టు టెండర్ల విషయంలో ఎవరైనా భౌతికంగా అడ్డుకుంటే చర్యలుంటాయి
- 25 టెండర్ బిడ్లు మాత్రమే వచ్చాయి
- పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్లు చేసిన విషయం బహిర్గతం కావాలి
- ప్రస్తుత టెండర్లను రద్దు చేసి మరల టెండరుకు వెళ్ళాలని సీఎం ఆదేశించారు
- అర్హత విషయంలో చాలా కంపెనీలు ఉన్నా, పద్నాలుగు కంపెనీలే టెండరు వేయడానికి కారణం తెలుసుకుంటాం
- ఉన్న టెండర్లకు చాలా తక్కువ స్పందన వచ్చినందున రీటెండరింగ్ కు వెళుతున్నాం
- ప్రపంచ బ్యాంకు నియమాల ప్రకారం గత రెండు సంవత్సరాలలో ఒక కంపెనీ వంద కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి
- కాంట్రాక్టరు త్వరితగతిన కాంట్రాక్టు పూర్తిచేసే సామర్ధ్యం కలిగి ఉండాలి
- ఎక్కువమంది టెండరులో పాల్గొనేలా చేస్తే, రాష్ట్రంలో మరింత ఎక్కువ కిలోమీటర్లు అభివృద్ధి చేసే అవకాశం ఉంది
- జ్యుడీషియల్ ప్రివ్యూ కమీషన్, రివర్స్ బిడ్డింగ్ కూడా పారదర్శకత కోసమే
- కాంట్రాక్టర్లకు బ్యాంకులలో లిక్విడిటీ, కోవిడ్ కారణంగా లేబర్ అందుబాటు ఇబ్బదులు ఉండచ్చు
- నిధుల లభ్యత లేదు అనే ప్రశ్నలేని ప్రాజెక్టు ఇది
- అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో సంప్రదించమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసాం
- బ్యాంక్ గ్యారంటీ, జీపీఏ మాత్రమే హార్డ్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది
- ఏ రకమైన సమస్య ఉన్నా కాంట్రాక్టింగ్ ఏజెన్సీలు సరాసరి ఛీఫ్ ఇంజనీర్ కు సంప్రదించవచ్చు
- టెండరు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం నుంచీ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది