V.Hanumantha Rao: పిచ్చి రాతలు రాస్తే.. భ‌ట్టి, ఉత్తమ్ లు ఎందుకు నోరు విప్పడం లేదు: వి.హన్మంత్ రావు

- మా నాయకురాలి పై సోషల్ మీడియా లో పిచ్చి రాతలు రాస్తే డిసిప్లేన్ కమిటీ , బట్టి , ఉత్తమ్ లు ఎందుకు నోరు విప్పడం లేదని వి.హన్మంత్ రావు, మాజీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

- మరోసారి ఏఐసిసి అధ్యక్ష రాలు గా సోనియా గాంధీ బాధ్యతలు తీసుకోవడం సంతోషకకమైన విషయం.

- 23 మంది లేఖ రాయడం గత కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు లేదు.

- సోనియా వయసు అయిపోయింది. రాహుల్ పని అయిపోయిందని మా పార్టీ లో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. 

కోర్ కమిటీ ఎందుకు పెట్టడం లేదో స్పష్టం చెయాలి

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గతంలో లేని కొత్త కల్చర్ వచ్చింది. మా లాంటి సీనియర్ల పై ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తున్నారు.

దీనికి ఫుల్ స్టాప్ పడకపోతే భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు.

- రాష్ట్ర పార్టీలో జరుగుతున్న తంతు పై చాల సార్లు ఢిల్లీ నేతలకు చెప్పాను. పట్టించుకొనే పరిస్థితి లేదు.

- కాంగ్రెస్ లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరో ఎంక్వేరి జరగాలి.

- లేఖ రాసిన వారికి , రాష్ట్రంలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతల కు బీజేపీ మీద , మోడీ మీద రాహుల్ , సోనియాగాంధీ లు చేస్తున్న పోరాటం కనిపించడం లేదా?

- సోషల్ మీడియా వచ్చినప్పుటి నుండి కాంగ్రెస్ లో ఎవరికి వారు పిచ్చి రాతలు రాయించిన వారిపై చర్యలు తీసుకోవాలి.

- ఉత్తమ్ , బట్టి లు సోనియాగాంధీ , రాహుల్ గాంధీ ల విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.

- ఒక ఎంపీ గాంధీ కుటుంభంపై సోషల్ మీడియా లో పిచ్చి రాతలు రాయిస్తూ నాకు తెలియదని చేతులు ఎత్తేస్తున్నరు

- అతని మీద ఎంక్వేరి జరగాలి. లేదా నినె స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తాను

Update: 2020-08-25 10:08 GMT

Linked news