Tirumala Updates: నవంబరు నుండి ఆన్‌లైన్ సేవలుగా శ్రీవారి ఆర్జిత సేవలు....
తిరుమల
-- శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కోవిడ్ - 19 నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్లో వర్చ్యువల్ విధానంలో నవంబరు నెలలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయం.
-- లాక్‌డౌన్ తరువాత శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తుంది.
-- వర్చ్యువల్ ఆర్జిత సేవల పాల్గొన్న భక్తులకు దర్శనం లేదు.
-- సాయంకాలం నిర్వహించే సహస్రదీపాలంకార సేవను భక్తుల విజ్ఞప్తి మేరకు ఆలయం వెలుపల సహస్రదీపాలంకార సేవా మండపంలో ప్రయోగాత్మకంగా నిర్వహణ
-- ఇకపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధులలో విహరించి ఆలయానికి చేరుకుంటారు.
-- ఈ సేవలను గృహస్థ భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి వీక్షించాలి.
-- సేవల్లో పాల్గొనే గృహస్తుల గోత్ర నామాల పట్టికను శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.