Telangana Weather updates: తెలంగాణ లో తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి ,రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం:రాజారావు..

-రాజారావు వాతావరణ అధికారి @హైదరాబాద్..

-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధం గా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది...

-ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ లో తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి ,రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

-రాయలసీమ లో తేలికపాటి వర్షాలతో పాటు కర్నూలు, కడప,అనంతపురం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

-ఈ అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 కిమి వేగంతో గాలులు విస్తున్నందున చేపల వేటకు వెళ్లరాదు...

-హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి ,రెండు చోట్లా భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది..

-తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం ,మహబూబ బాద్ ,జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ మేడ్చల్ ,రంగారెడ్డి జిల్లాలో భారీ నుండి   అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..

Update: 2020-09-14 05:21 GMT

Linked news