Telangana Updates: వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్....

- చంచలగుడ జైల్ కి రిమాండ్ కి తరలింపు.

- అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శాంపూర్ గ్రామానికి చెందిన కునమల్ల శ్రీనివాస రావు అనే వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ పేరు చెప్పి మోసం.

- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు ఫోన్ చేసి తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారిగా పరిచయం చేసుకుంటున్నాడు.

- ముఖ్యంగా మహిళలకు ఫోన్ చేసి వారిలో కొంతమందిని పర్మినెంట్ చేయబోతున్నామని అందుకు గాను కొంత ఖర్చు అవుతుందని చెప్తున్నాడు.

- అలా ఫోన లు వచ్చిన కొంతమని మంత్రి ఈటెల దృష్టికి తీసుకురావడంతో అతని మీద ఫిర్యాదు చేయాలని మినిస్టర్ PS కు ఆదేశించారు.

- ఆ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసు లు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి చంచలగుడా జైల్ కి తరలించారు.

- శ్రీనివాస్ మీద గతంలో 5 కేసులు ఉన్నట్టు పోలీస్ లు తెలిపారు.

- వైద్య ఆరోగ్యశాఖ లో పనిచేస్తున్న డాక్టర్స్, వైద్య సిబ్బంది , కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు , ట్రాన్స్ఫర్ లు, పోస్టింగ్స్ ఇప్పిస్తామని ఇలాంటి ఫోన్ కాల్స్   పట్ల జాగ్రత్తగా ఉండాలి

- ఇలాంటివి నమ్మకూడదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

- ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

- పోలీస్ లకు ఫిర్యాదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

Update: 2020-10-27 15:46 GMT

Linked news